Vijayawada(Samrudha Odisha) Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer gave a call to all young students of Andhra Pradesh, to participate in ‘Viksit Bharat Young Leaders Dialogue’ that gives them a unique opportunity to present their ideas and vision directly to Prime Minister Sri Narendra Modi. Elaborating further, Governor Sri Abdul Nazeer has said that the Viksit Bharat Challenge programme has been launched on My Bharat Platform with a Digital Quiz on 25th November 2024. Government of India has initiated a new platform for youth engagement to be held as part of the National Youth Festival in 2025. The “Viksit Bharat Young Leaders Dialogue” which will take place during the National Youth Festival to be held at the Bharat Mandapam in New Delhi on January 11 and 12, 2025, aligns with the Prime Minister’s vision for increased youth participation in national development. The Viksit Bharat Young Leaders’ Dialogue will feature an interaction between Prime Minister Sri Narendra Modi and 3,000 youth leaders selected from across the country, The Viksit Bharat Challenge is a four-stage competition, exclusively meant for the young people to participate and contribute their vision and ideas. The Viksit Bharat Challenge was launched with an all-India digital quiz competition, scheduled from November 25 to December 5, 2024, open to all individuals in the age group of 15 to 29. The quiz is being hosted on the Mera Yuva Bharat platform at https://mybharat.gov.in. All details related to Viksit Bharat Young Leaders Dialogue – National Youth Festival 2025, are available on this portal. This year’s Youth Festival has been thoughtfully structured around two major goals i.e. to bring new youth leaders into politics, and to ensure the meaningful contribution of youth towards Viksit Bharat, a developed India, through a transparent and democratic, merit-based selection system. The festival aims to identify and nurture young talent, providing them a platform to share their ideas for Viksit Barat.” Governor Sri Abdul Nazeer directed all Vice Chancellors of the State Universities to ensure that the students of their respective universities are registered in the My Bharat portal and to participate in the four-stage competition and avail the unique opportunity to present their ideas and vision directly to Prime Minister Sri Narendra Modi.
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడ, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లోని యువ విద్యార్థులందరూ తమ ఆలోచనలను, దార్శనికతలను నేరుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందించే అపూర్వ అవకాశాన్ని కల్పించే ‘వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ’లో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. 25 నవంబర్ 2024న డిజిటల్ క్విజ్‌తో మై భారత్ వెబ్ సైట్ ద్వారా విక్షిత్ భారత్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ తెలిపారు.జనవరి 11 మరియు 12 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న జాతీయ యువజనోత్సవాల సందర్భంగా జరిగే “వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్” దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 3,000 మంది యువ నాయకుల మధ్య పరస్పర చర్చ ఉంటుందని గవర్నర్ తెలిపారు. వికసిత్ భారత్ ఛాలెంజ్ అనేది నాలుగు-దశల పోటీ, ఇదిమన దేశ యువత పాల్గొనడానికి మరియు వారి దృష్టి మరియు ఆలోచనలను అందించడానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. వికసిత్ భారత్ ఛాలెంజ్ ఆల్-ఇండియా డిజిటల్ క్విజ్ పోటీ నవంబర్ 25 నుండి డిసెంబర్ 5, 2024 వరకు, 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులందరూ పాల్గొనడానికి అందుబాటులో ఉంటుంది. ఈ క్విజ్ మేరా యువ భారత్ పోర్టల్ (https://mybharat.gov.in) లో నిర్వహించబడుతోంది. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – నేషనల్ యూత్ ఫెస్టివల్ 2025కి సంబంధించిన అన్ని వివరాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం యూత్ ఫెస్టివల్ రెండు ప్రధాన లక్ష్యాలతో, ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. యువ నాయకులను ప్రథమంగా రాజకీయాల్లోకి తీసుకురావడం మరియు పారదర్శక మరియు ప్రజాస్వామ్య యోగ్యత ఆధారిత ఎంపిక పద్దతిలో , భారతదేశ అభివృద్ధికి యువత యొక్క అర్ధవంతమైన సహకారాన్ని నిర్ధారించడం, యువత యొక్క ప్రతిభను గుర్తించడం, వారి ఆలోచనలను పంచుకోవడానికి వారికి ఒక వేదికను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. యూనివర్సిటీల విద్యార్థులు మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకుని, నాలుగు దశల పోటీల్లో పాల్గొని తమ ఆలోచనలను, దార్శనికతలను నేరుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందజేసే ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకోనేలా విద్యార్థులను ప్రోత్సహించాలని గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు సూచించారు.